తన ఫస్ట్ సినిమాని వదులుకోవడానికి కారణం తెలిపిన కిరణ్ అబ్బవరం..?

-

సినిమా ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు.. అయినా కూడా పట్టుదలతో తన వంతు కృషి చేసి పేరుపొందాడు కిరణ్ అబ్బవరం. తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మతమే. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కాబోతోంది తాజాగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.Kiran Abbavaram (@Kiran_Abbavaram) / Twitterకిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మాది కడప జిల్లా రాయచోటి.. నేను కాలేజీలో చదువుకునే రోజులలో నీకు జాబు రాదు బస్టాండ్ బఠాణీలు అమ్ముకోవాల్సిందే అని లెక్చరర్స్ తిట్టే వారట. దాంతో తనకు జాబ్ రాలేదని అనుకునేవాడిని కానీ లక్కీగా మా క్లాసులో అందరికంటే ముందు తనకి జాబు వచ్చిందని తెలిపారు. తనకు జాబ్ వచ్చిందంటే తన కుటుంబ సభ్యుల నమ్మలేదట. ఇక ప్రతి నెల 70 వేల రూపాయలు వస్తూ ఉండేది అని తెలిపారు. అయితే మొదటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి ఎక్కువగా ఉండేది అందువల్లనే జాబ్ పై దృష్టి ఉండేది కాదని సినిమాలతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా చూసేవాడిని తెలిపారు.

ఇక సినీ ఇండస్ట్రీలోని వారి కష్టాలను వీడియోల రూపంలో చాలానే చూశాను ఆ ఉద్దేశంతోనే పలు షార్ట్ ఫిలింలో కూడా చేయడం మొదలుపెట్టాను తెలిపారు. ఇక హీరోగా ప్రయత్నాలు చేద్దాం అనుకోని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను ఒక సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది ఆ సినిమాలో సాయి కుమార్ గారు కీలకమైన పాత్ర చేశారు.ఆ సెట్ వాతావరణం తనకు ఎందుకు నచ్చలేదు తనకు సంబంధించిన వరకు సరిగ్గా లేకపోతే ఆ డైరెక్టర్ నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. మొదటి రోజు కాస్త ఓపిక పట్టాను ఇక ఆ తర్వాత మన వల్ల కాదు అని చెప్పేసి నేను ఆ సినిమాను వదులుకున్నానని తెలిపారు. ఇక దీని తర్వాతే ఓపికగా ఉంటే ఎక్కడ వరకైనా వెళ్లొచ్చు అని అర్థం అయిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news