ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ స్టార్ల‌ను లైన్ లో పెడుతున్న కొరటాల‌!

-

జూన‌యర్ ఎన్టీఆర్ NTR కూడా ప్ర‌భాస్ త‌ర‌హాలోనే నేష‌న‌ల్ స్టార్ అయ్యేందుకు అన్ని సెట్ చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ లాంటి సెన్సేష‌న‌ల్ ప్రాజెక్టులో న‌టిస్తున్నాడు. ఇక దీని త‌ర్వాత కూడా ఆయ‌న ప్యాన్ ఇండియ‌న్ మూవీలే చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే కొర‌టాల డైరెక్ష‌న్‌లో త‌న 30వ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్/ NTR
ఎన్టీఆర్/ NTR

దీన్ని కూడా ప్యాన్ ఇండియ‌న్ మూవీగానే తీస్తున్నాడు కొర‌టాల శివ‌. ఇక ఎన్టీఆర్‌కు నార్త్‌లో మార్కెట్ పెంచేందుకు ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ల‌ను ఇందులో న‌టింప‌చేస్తున్న‌ట్టు వినిపిస్తోంది. కియారా అద్వానీని ఇందులో హీరోయిన్ గా ఫైనలైజ్ చేస్తున్నార‌ని స‌మాచారం.

ఇంక ఇదే త‌ర‌హాలో బాలీవుడ్‌లోని ఓ స్టార్ యాక్టర్ ను కూడా ఇందులో చేయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికే మోహ‌న్ లాల్ వంటి సూప‌ర్ స్టార్ ను తీసుకొచ్చిన కొర‌టాల‌.. అలాంటి పాత్ర‌నే డిజైన్ చేసి మ‌రీ బాలీవుడ్ స్టార్ న‌టుడితో చేయించేందుకు రెడీ అవుతున్నారు. దాని ద్వారా బాలీవుడ్‌లో మార్కెట్ పెంచేందుక స్కెచ్ వేస్తున్నారు కొర‌టాల‌. చూడాలి మ‌రి దీనిపై అప్‌డేట్ ఎప్పుడు వ‌స్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news