ఆచార్య తో కొరటాల శివ పరిస్థితి అయోమయంగా మారిందా …?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అంతటి సక్సస్ ట్రాక్ ని మేయిన్‌టైన్ చేస్తున్న డైరెక్టర్ అంటే కొరటాల శివ అని చెప్పక తప్పదు. రచతగా సక్సస్ ఫుల్ ట్రాక్ నుండి దర్శకుడిగా మారుతు ప్రభాస్ తో మిర్చి సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. డైరెక్టర్ గా కొరటాల శివ తీసిన మొదటి సినిమానే ప్రభాస్ కి మంచి మాస్ హిట్ ని ఇచ్చింది. ప్రభాస్ ని క్లాస్ గా చూపిస్తూనే మాస్ హిట్ ఇచ్చారు కొరటాల అన్న కామెంట్స్ సాధించుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించారు. బహుషా ఇలా వరుస సక్సస్ లని అందుకున్న దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు.

 

ఈ సక్సస్ ట్రాక్ చూసే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇది నిజంగా కోరటాల కూడా ఊహించలేదనే చెప్పాలి. అందుకే కొరటాల శివ ఈ సినిమా కోసం ఇప్పటికే రెండేళ్ళు ఆగాల్సి వచ్చింది. వాస్తవంగా అయితే ఈ రెండేళ్ళలో మళ్ళీ ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా మహేష్ బాబు తో ఒక సినిమా కంప్లీట్ చేసుండేవారు. కానీ అక్కడ ఉంది మెగాస్టార్ ప్రాజెక్ట్ కాబట్టి ఇవేవి పట్టించుకోలేదు. ఎట్టకేలకి సినిమా సెట్స్ మీదకి వచ్చింది. ఇందులో మరో స్టార్ హీరో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడని మే మూడో వారం నుండి చిరంజీవి తో కలిసి ఫ్రేం లోకి వస్తారని అన్నారు.

అయితే కరోనా విపత్కరం తో ఇప్పుడు ఆచార్య సినిమా కి ఒక్కసారిగా అన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. ఇప్పుడున్న టాక్ ప్రకారం మహేష్ బాబు ఈ సినిమా నుండి తపుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయట. మొన్నటి వరకు భారీ పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలకున్నప్పటికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరిమితుల ని దృష్ఠిలో పెట్టుకొని మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. అయితే ఆచార్య సినిమా విషయంలో ఎప్పటికప్పుడు కొరటాల శివ కి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దేవదాయ ధర్మదాయ శాఖలో జరుగుతున్న అక్రమాల నేపథ్యం లో కథ సాగుతుందని బయటకి వార్త రాగానే కొందరు అభ్యంతరాలు తెలిపారు. దాంతో కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అలాగే మరో హీరో విషయంలో సమస్యలు పరిష్కారం అవడం లేదు. ఇప్పుడు బడ్జెట్ విషయం కూడా కొరటాల ని బాగా ఇబ్బందులు పెడుతుందట. దాంతో ఏం చేయాలో తోచక అయోమయంగా ఉన్నారట కోరటాల శివ.

Read more RELATED
Recommended to you

Latest news