అలర్ట్ అవ్వాల్సిన టైమ్ ఇది .. తేలికగా తీసుకుంటే పెద్ద ప్రమాదం ?

-

ఊహించని విధంగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారి వల్ల ఊహించని విధంగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 21 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన చాలా వరకు ప్రజలు ఇష్టానుసారంగా బయటికి వచ్చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట అంతా బాగానే ఉంది, కంట్రోల్ లో ఉంది అని అందరూ భావించినా ఢిల్లీకి మత ప్రార్థనలు వెళ్లిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరగటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది.Committed Suicide Due To Fear Of Corona Virus - कोरोना ...ఇదిలా ఉండగా ఇప్పటివరకు పాటించిన లాక్ డౌన్ ఒక ఎత్తు అయితే ఏపీలో రానున్న రోజులల్లో పాటించే లాక్ డౌన్ మరొక ఎత్తు అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇదే అసలు సిసలైన అలర్ట్ అవ్వాల్సిన టైం అని..ఇటువంటి సమయాన్ని తేలిగ్గా తీసుకుంటే పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో జరగబోతుందని చాలామంది చెప్పుకొస్తున్నారు.

 

దీంతో రాబోయే ఒక పది రోజులు ఎవరికి వారు ఇంటికి పరిమితం అయి లాక్ డౌన్ సరిగ్గా పాటిస్తే మన భవిష్యత్తును కాపాడుకున్న వారమవుతాము అంటూ కూడా మాటోపక్క రాష్ట్రంలో ఉన్న వైద్యులు కూడా సూచిస్తున్నారు. జగన్ సర్కారు కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా రేషన్ ముందే ఇవ్వటం, అదేవిధంగా వెయ్యి రూపాయలు అనుకోని ఈ విపత్తు గురించి ప్రతి కుటుంబానికి కేటాయించడం, అంతా బాగానే ఉంది. కానీ ప్రజలే సహకరించాలని రానున్న రోజుల్లో చాలా కీలకమని చాలామంది వైద్య నిపుణులు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news