కొరటాల శివ ఈ విషయం లో ఎంతో గొప్ప వ్యక్తి .. ఇలాంటి పని చేసే ధైర్యం ఇంకెవరీకీ ఉండదు ..!

-

టాలీవుడ్ లో ఉన్న సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ లో కొరటాల శివ కూడ ఒకరు. రచయితగా సినిమా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలకి రచనా సహకారం అందించారు. పోసాని మురళీ కృష్ణ దగ్గర పని చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ ని అందుకుంది. అంతేకాదు ప్రభాస్ కి మంచి సూపర్ హిట్ ని ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలు తీశారు. ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్ఠించాయి. ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్స్ కావడం విశేషం.

 

ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తూ ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఆదేశాల మేరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంతో మందికి ఉపాధి కరువైంది. ఇందుకోసం చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి పేదలను ఆదుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమా ని తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ గురించి మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కొరటాల తీసిన సినిమాలన్నిటిలోను సామాజిక అంశం, సమాజంలో మన బాధ్యత గురించి ప్రత్యేకించి చెబుతుంటారు. ఆయన కథా నేపథ్యం మొత్తం సామాజిక అంశం చుట్టే తిరుగుతుంటుంది. అయితే కొరటాల ఇలా సినిమాలలోనే బాధ్యతగా వ్యవహరిస్తారని అందరు అనుకుంటారు.

కాని ఆయన నిజ జీవితం లోను అలాంటి బాధ్యతని తీసుకొని చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న విషయం మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి తెలీదు. ఇప్పుడదే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. కొరటాల శివ పిల్లలని కంటే సమాజం గురించి ఆలోచించ లేనని ఇక జీవితాంతం పిల్లలని వద్దనుకున్నారట. ఇలాంటి నిర్ణయం ఎంతమంది తీసుకుంటారు. నిజంగా ఈ విషయంలో మాత్రం కొరటాల శివ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news