కేజీఎఫ్ 2 కి కరోనా ఎఫెక్ట్ .. బిజినెస్ మొత్తం తారుమారు అవుతుందా …?

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా తో కన్నడ స్టార్ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఖచ్చితంగా చెప్పాలంటే బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి ఎంతగా క్రే వచ్చిందో అంత క్రేజ్ యశ్ కేజీఎఫ్ సినిమాతో దక్కించుకున్నాడు. నార్త్, సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రముఖ, దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలందరి తో ను యశ్ గొప్ప గొప్ప ప్రశంసలను అందుకున్నాడు. చిన్న పరిశ్రమ అయినా కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన కేజీఎఫ్ షూటింగ్ లో ఉన్నప్పుడు నిజంగా యశ్ కి ఈ రేంజ్ క్రేజ్ వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. భారీ కలెక్షన్స్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది.

 

ఇక ఈ సినిమా రిలీజైన అన్నీ బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో హీరోలకి ప్రశాంత్ నీల్ ఫేవరేట్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి వాళ్ళు తన డైరెక్షన్ లో సినిమా చేయాలన్న క్రేజ్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంపాదించుకున్నాడు. అయితే ఈ స్టార్స్ అందరి తో ను ప్రశాంత్ నీల్ కి సినిమా తీయాలన్న ఆసక్తి కూడా ఉంది. ఇక ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ చూసిన మేకర్స్ మళ్ళీ కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మించాలని సన్నాహాలు చేశారు. అందులో భాగంగానే మేకర్స్ హీరో యశ్ తో కేజీఎఫ్2 ని నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ అధీరా అన్న విలన్ పాత్ర లో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట. రవీనా పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. విలన్స్ అందరినీ అంతమొందించిన తర్వాత రాఖీభాయ్ కేజీఎఫ్ కింగ్ అవుతాడని మరో న్యూస్ కూడా బయటకి వచ్చింది. అయితే ఇవన్ని బాగానే ఉన్నప్పటికి ప్రస్తుతం ఇండస్ట్రీలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇంకో మూడు నాలుగు నెలలు సినిమాలు రిలీజ్ గాని కలెక్షన్స్ పరంగా గాని బాగా ఎఫెక్ట్ పడనుందని తెలుస్తుంది. అంతేకాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు వసూళ్ళ పరంగా నిర్మాతలకి షాక్ తగలబోతుందని సమాచారం. అలాగే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కి వసూళ్ళ పరంగా, బిజినెస్ పరంగా దెబ్బ పడబోతుందట.

Read more RELATED
Recommended to you

Latest news