కేపీ చౌదరి కేసులో ట్విస్ట్‌..14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ?

-

కేపీ చౌదరి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారట. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా కేపీ వాట్సాప్ డాటాను రీట్రైవ్ చేశారు పోలీసులు.

అలాగే, సినీ ప్రముఖులతో కేపీ చౌదరి సంబంధాలపై ఆరా తీసుకున్నారు పోలీసులు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు సైబరాబాద్ పోలీసులు. ఈ తరుణంలోనే… సోషల్ మీడియా వేదిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కేపీ తో ఫ్రెండ్షిప్ తప్ప డ్రగ్స్ కు సంబంధం లేవని చెబుతున్నారు సినీ నటులు.

Read more RELATED
Recommended to you

Latest news