Vijay Deverakonda : ఖుషీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండకు సపరేట్ క్రేజీ ఉందని చెప్పవచ్చు. తాజాగా సమంత విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయ్ అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు.

ప్రస్తుతం సమంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news