మార్చి 15వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారట. లక్ష్మీస్ ఎన్‌టీఆర్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో..!
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఆది నుంచి వర్మ ఈ చిత్రం విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. చిత్ర పోస్టర్ల దగ్గర్నుంచీ మొన్నీ మధ్యే విడుదలైన ట్రైలర్ దాకా ఈ సినిమాపై వర్మ అభిమానుల్లో భారీ అంచనాలనే పెంచారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి దృష్టి ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై పడింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపులకు ఇక బ్రేక్ పడినట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మార్చి 15వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారట. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందని కూడా తెలిసింది. కాగా ఈ సినిమాకు చెందిన పోస్టర్లతోపాటు ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల వ్యూస్ దానికి వచ్చాయి. దీన్ని బట్టే చెప్పవచ్చు.. లక్ష్మీస్ ఎన్‌టీఆర్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో..!
కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ జీవితంతోపాటు ప్రధానంగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తరువాత జరిగిన యదార్థ ఘటనలను లక్ష్మీపార్వతి కోణంలో చూపిస్తున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడులలా కాకుండా ఈ సినిమాలో అన్నీ నిజాలనే చెప్పామని వర్మే ఇప్పటికే అనేక సార్లు చెప్పారు కూడా. మరి దాని తాలూకు విషయాలు సినిమాలో ఉంటాయా, లేదా అన్న వివరాలు తెలియాలంటే.. లక్ష్మీస్ ఎన్‌టీఆర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే..!