చివ‌రి ద‌శ‌లో లైగ‌ర్ షూటింగ్ ! లాస్ట్ షెడ్యూల్ ఎక్క‌డే

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో రౌడీ హీరో విజ‌య దేవ‌ర‌కొండ హీరో గా, బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన గా వ‌స్తున్న సినిమా లైగ‌ర్. అలాగే అంత‌ర్జాతీయ న‌టుడు, బాక్సర్ మైక్ టైస‌న్ కీలక పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. ఈ సినిమా మిక్డ్స్ మార్ష‌ల్ ఆర్ట్స్ క‌థ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా కు సంబంధించి చివ‌రి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు.

ఈ నెల 12 నుంచి చివ‌రి షేడ్యూల్ షూటింగ్ ను అమెరికా లో ప్రారంభించ‌నున్నారు. అయితే ఈ సినిమా లో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్సర్ గా క‌నిపించ‌డం, మైక్ టైస‌న్ న‌టించ‌డం వంటివి ఈ సినిమా లో ఉండ‌టంతో ఈ సినిమా పై భారీ గా అంచ‌నాలు పెరిగి పోయాయి. అలాగే ఈ సినిమా లో ర‌మ్య‌కృష్ణ కూడా కీలక పాత్ర లో న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమా ను వ‌చ్చే నెల 12న ఈ సినిమా ను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.