అదేంటి యాక్ష‌నే చెప్ప‌లేదు టీజ‌రా?

కొబ్బరి కాయ కొట్ట‌క‌ముందే సినిమా వార్త ప్ర‌పంచం చుట్టి రావాల‌ని చూసే రోజులివి. ఓ కాంబినేష‌న్‌లో సినిమా వ‌చ్చేస్తోంద‌టే ఆ వార్త సినిమా ప్రారంభానికి ముందే వైర‌ల్ కావాల్సిందే. ఇప్పుడు ఇదే ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ని `ఖైదీ` ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ఫాలో అవుతున్నాడు. ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా `మాస్ట‌ర్‌` చిత్రాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ త‌రువాత క‌మ‌ల్‌హాస‌న్‌తో లోకేష్ కన‌క‌రాజ్ ఓ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ న‌టిస్తూ నిర్మిస్తున్నారు. క‌మ‌ల్ న‌టిస్తున్న 232వ చిత్ర‌మిది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్నారు. అదేంటి యాక్ష‌నే చెప్ప‌లేదు టీజ‌ర్ ఏంటి? అనే సందేహం ప్ర‌తీ ఒక్క‌రికీ రావడం స‌హ‌జం.

అయితే ఈ మూవీ కోసం ట్ర‌య‌ల్ షూట్‌ని నిర్వ‌హించార‌ట‌. అందులోని కొన్ని స‌న్నివేశాల్ని తీసుకుని క‌మ‌ల్ పుట్టిన రోజున టీజర్ రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. న‌వంబ‌ర్ 7న క‌మ‌ల్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని లోకేష్ క‌న‌క‌రాజ్ టీజ‌ర్‌ని స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వ‌బోతున్నార‌ట‌.