గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్దం…!

వరదలతో ట్రాక్ తప్పిన గ్రేటర్ ఎన్నికలు మళ్లీ పట్టాలెక్కబొతున్నాయి.తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో కీలక సమావేశం నిర్వహించారు. GHMC యాక్ట్ ప్రకారం మూడు మాసాల ముందుగా ఎన్నికలు జరు పుకోవచ్చు.


గతంలో ఉన్న డివిజన్లతోనే ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం కమీషనర్ పార్థసారథి నిర్ణయించారు.త్వరలో ఓటరు జాబితా నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ 7వ తేదీన డ్రాఫ్ట్ ఫోటో ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.నవంబర్ 8 నుంచి 11 వరకు అభ్యంతరాల సేకరించి నవంబర్9వ తేదీన GHMC ప్రధాన కార్యాలయంలో అన్ని రాజకీయ పక్షాల తో సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 12న రాజకీయ పక్షాల అభ్యంతరాలను పరిశీలించి నవంబర్13న తుది ఫోటో ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.