ప్రేమ కేవలం ఛాయిస్ మాత్రమే.. పూరీ జన్నాథ్

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు అభిమానులకు తనదైన స్టైల్ లో బూస్టింగ్ ఇస్తూ ఉంటారు అయితే ఈయన కరోనా సమయంలో మొదలుపెట్టిన పూరి మ్యూజిక్ ని మళ్లీ ఇప్పుడు తాజాగా స్టార్ట్ చేశారు.. డోంట్ ఓన్ పేరుతో ప్రేమ గురించి మరొకసారి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..

పూరి జగన్నాథ్ మరోసారి పూరి మ్యూజింగ్ లో ప్రేమ కోసం చెప్పవచ్చారు.. ఈ సందర్భంగా ప్రేమ, స్వేచ్ఛ, రిలేషన్స్ పై మాట్లాడారు… ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఒక ఛాయిస్ మాత్రమేనని అవసరం కాదని అన్నారు ప్రేమ పేరుతో అధికారం చలాయించి ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదని చెప్పుకొచ్చారు..

అలాగే “బుద్దుడు సర్వసంగ పరిత్యాగి, ఏది నాదని అనుకోవద్దని చెప్పాడు. ఆయన చెప్పాడని అన్నీ వినలేం కదా. బ్యాంక్‌ బ్యాలెన్స్, ఇళ్లు, కారు ఉండాలనుకుంటాం. దేనినైనా సొంతం చేసుకోండి. కానీ మనిషిని కాదు. ఈ వ్యక్తి నా ఆస్తి అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి ఫస్ట్ స్టెప్‌ ప్రేమ. లవ్‌ పేరుతో ఈ వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దీంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు, రాను రాను మీ ప్రేమ వాళ్లకి వేదింపుగా మారుతుంది. అవతలి మనిషి మనం చెప్పినట్టే వినాలి, రహస్యాలన్నీ మనతోనే పంచుకోవాలని అనుకుంటారు. మీది అలాంటి ప్రేమైతే దయజేసి ప్రేమించవద్దు. జీవితంలో ప్రేమ అనేది ఒక ఛాయిస్‌ మాత్రమే, అంతేకాని అది అవసరం కాదు..” అన్నారు..

అలాగే నీ ప్రేమ అవతలి వ్యక్తికి ఊపిరి ఆడకుండా చేసేది అవ్వకూడదని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భారమయ్య పరిస్థితి ఎప్పుడు రాకూడదని అన్నారు.. అని చెప్పుకొచ్చారు పూరీ. ఇద్దరూ గౌరవం, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని.. అలా కాకపోతే బంధాలు తెగిపోతాయని అన్నారు నీ జీవితంలో జరిగే సంఘటనలు కొన్నిసార్లు నీకే తెలియదు మరి పక్క వాళ్ళ జీవితం గురించి నీకు ఎలా తెలుస్తుందని చెప్పకు వచ్చారు.. అలాగే `మనందరం భూమ్మీదకు టూర్‌ కోసం వచ్చాం. టూరిస్ట్ లా ఉందాం. చూద్దాం. ఎంజాయ్‌ చేద్దాం, టూర్‌ పూర్తికాగానే వెళ్లిపోదాం, అంతేకానీ నీతోటి పర్యాటకుడిని సొంతం చేసుకోవాలని మాత్రం చూడొద్దని..’ తెలిపారు పూరీ జగన్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news