ఒరు అదార్ లవ్ సినిమా టీజర్ తో ప్రియా ప్రకాశ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత ప్రియా ప్రకాశ్ తో పాటుగా అందులో నటించిన మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్ గురించి కూడా మాట్లాడుకున్నారు. కన్నుగీటి కుర్రాళ్ల మతులు పోగొట్టడం ప్రియా వంతు అయితే తన చూపులతోనే నూరిన్ యువతను ఆకట్టుకుంది. ఒరు ఆధర్ లవ్ తెలుగులో లవర్స్ డేగా రిలీజైంది.
సినిమా పెద్దగా ఆడలేదు కాని అందులో నటించిన ప్రియా ప్రకాశ్, నూరిన్ షరీఫ్ ఇద్దరికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగులో క్రేజ్ తెచ్చుకునేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సపోర్ట్ తెలిసిందే. లవర్స్ డే ఆడియో రిలీజ్ కు బన్ని వచ్చి టీం అందరిని విష్ చేశాడు. ఇదిలాఉంటే సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆ సినిమాలో నటించిన నూరిన్ షరీఫ్ మాత్రం మీడియాతో టచ్ లో ఉంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రియాకు క్రేజ్ రావడం వల్ల తను మెయిన్ లీడ్ గా ఉండాల్సిన కథను తను లీడ్ హీరోయిన్ గా మార్చారని చెప్పుకొచ్చింది. ఇక మల్లూవుడ్ లో అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. అందరిలానే నూరిన్ కూడా బన్నికి పెద్ద ఫ్యాన్ అట.. లవర్స్ డే ఈవెంట్ కు ఆయన రావడంతో సంతోషంలో ఆయన్ను పెళ్లాడాలనిపించిందని అన్నది నూరిన్. మొత్తానికి బన్ని మళయాళ భామల మనసు కాజేశాడని మాత్రం చెప్పొచ్చు.