బ్రేకింగ్ : ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

మా అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం రిలీజ్‌ అయింది. అక్టోబర్‌ 10 వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో పోలింగ్‌ జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి వి. కృష్ణ మోహన్‌ ఎన్నికల నోటిపికేషన్‌ జారీ చేశారు.

ఎన్నికల్లో ఎనిమితి మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిచనున్నారు. కాగా.. ఈ నెల 30 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉప సంహరణకు వచ్చే నెల 1 నుంచి 2 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. అక్టోబర్‌ రెండో తేదీ సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10 న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. అయితే.. ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.