అటెండెన్స్ వేయించుకోవడానికి అసెంబ్లీకి వెళ్లడం సిగ్గుచేటు.. జగన్ పై పురంధేశ్వరి ఫైర్..!

-

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందనే.. జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని పురందేశ్వరి చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. హాజరు కోసం అసెంబ్లీకి వెళ్లారని విమర్శించారు.

ప్రజలు ఇచ్చిన బాధ్యతలను మర్చిపోరాదని అన్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పారు. వైసీపీ హయాంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ ను రూపొందించారని పురందేశ్వరి చెప్పారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని పురందేశ్వరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news