‘నేత్ర’ స‌స్పెన్స్ థ్రిల్ చేస్త‌దా…?

-

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్లు ఎక్కువ‌గా వ‌చ్చే నేప‌ధ్యంలో ‘నేత్ర’ చిత్రం స‌స్పెన్స్‌ని చూపిస్తుంది. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది. ఈ చిత్రం ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుంది. చిన్న సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్న నేప‌ధ్యంలో క‌థ ఉంటేనే సినిమాను ఆద‌రిస్తున్న త‌రుణంలో డైరెక్ట‌ర్ క‌థ‌ను ఎంత బాగా మ‌లిచాడు. ఏంటి అన్న‌ది సినిమా చూస్తే గాని అర్ధం కాదు.

నిర్మాత‌గా హుస్సేన్(ఎ.ఎండి) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నేత్ర’. లతా సంగ‌రాజు, గీతా సింగ్, బ‌ద్రం, కేదార్‌శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను ‘ మా ‘ అధ్య‌క్షుడు డా. న‌రేష్ , నటుడు శివబాలాజీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర ద‌ర్శ‌కుడు హుస్సేన్ (ఎ.ఎండి) మాట్లాడుతూ … ముందుగా మా చిత్రం ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేసిన న‌రేష్ గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ‘నేత్ర’ ఒక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. లతా సంగ‌రాజు, గీతా సింగ్, బ‌ద్రం ఇలా ప్ర‌తి ఒక్క‌రూ వారి క్యారెక్ట‌ర్ లో చాలా బాగా న‌టించారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ర‌ఘునాథ‌న్ సినిమాటోగ్ర‌ఫి, రాజ్‌కిర‌ణ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. మా నిర్మాత సుబ్బారెడ్డి గారు సినిమాపై ఎంతో ఫ్యాష‌న్ తో మాకు కావాల్సిన‌వ‌న్నీ స‌మ‌కూర్చారు. ప్ర‌స్తుతం సెన్సార్ కి సిద్దంగా ఉంది. త్వ‌ర‌లోనే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి విడుద‌ల తేదిని ప్ర‌కటిస్తాం” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news