తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా చేయాలని ‘మా’ నిర్ణయం

-

తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకల రంగం సిద్ధం అవుతోంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా అత్యంత వైభవంగా నిర్వహించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్ణయించింది. మలేషియా వేదికగా జులైలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు మలేషియా ప్రభుత్వ సలహాదారు కమలనాథన్, అక్కడి పర్యాటక శాఖ డైరెక్టర్ అబ్దుల్ రహీంతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారికి తెలుగు సినిమా ఇండస్ట్రీ 90 ఏళ్ల వేడుకల వివరాలను వెల్లడించారు.

రెండేళ్ల కిందటే ఈ వేడుకలను నిర్వహించాలని భావించినా అనివార్య కారణాల వల్ల కుదరలేదని మంచు విష్ణు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుకుంటున్న వేళ మరోసారి తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని చాటేందుకు గతంలో కంటే గొప్పగా ఈ వేడుకలను మలేషియాలో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్‌ను సంప్రదించి జులైలో పరిశ్రమకు రెండు రోజులు సెలవు ప్రకటించాలని కోరామని చెప్పారు. అందుకు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించినట్లు విష్ణు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news