ఆమ్ ఆద్మీ కి షాక్.. ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు

-

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)చీఫ్, సీఎం అరవింద్ కేజీవాలు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ కి మరో షాక్ తగిలింది. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంటిపై శనివారం ఈడీ దాడులు చేపట్టినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. అతని సన్నిహితుల నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈడీ ఏ కేసులో దాడులు చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే గులాబ్ సింగ్ యాదవ్ సహచరులు తమ నుంచి డబ్బు వసూలు చేశారని ఇద్దరు ప్రాపర్టీ డీలర్లు ఆరోపించడంతో ఢిల్లీ పోలీసులు 2016లో గులాబ్ సింగ్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసులోనే ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా, గులాబ్ సింగ్ గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్చార్జిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంటిపై ఈడీ దాడి చేయడంపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. బీజేపీ ప్రభుత్వం మొత్తం విపక్షాలను జైల్లో పెట్టే పనిలో నిమగ్నమైందని విమర్శించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు నియంతృత్వ బాటలో పయనిస్తోందని మండిపడ్డారు. రష్యా, బంగ్లదేవ్, పాకిస్థాన్, ఉత్తరకొరియాను తలపిస్తోందని ఆరోపించారు. ప్రజల ప్రాథమిక హక్కులు తీవ్రంగా ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆపికి చెందిన నలుగురు అగ్ర నేతలను జైలులో పెట్టారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు గుజరాత్లో ఆప్ పోటీ చేస్తుంది. ఆ భయంతోనే బీజేపీ ఆ రాష్ట్ర ఇన్చార్జ్ గులాబ్ సింగ్పై దాడులు చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news