మాస్కోలో మ్యూజిక్ కన్సర్ట్‌పై ఉగ్రదాడి.. 60 మంది మృతి.. వందల మందికి గాయాలు

-

రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ మ్యూజిక్ కన్సర్ట్‌పై ఉగ్రదాడి జరిగింది. కన్సర్ట్ హాల్‌లోకి ఒక్కసారిగా వచ్చిన ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులు జరపగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది. ఈ ఘటన జరిగే అవకాశం ఉందని అమెరికా.. గతంలోనే రష్యాను హెచ్చరించడం గమనార్హం.

మొదట క్రాకస్‌ సిటీ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపారు. మరోవైపు బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. అనంతరం సంగీత కార్యక్రమం జరుగుతున్న హాల్‌ లోపలికి వెళ్లి అక్కడ కూర్చున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 60 మందికి పైగా మృతి చెందగా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మాస్కోలో జరిగిన ఈ దారుణమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సమయంలో రష్యా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం’ అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news