యూట్యూబ్ షేక్ చేస్తున్న రౌడీ బేబీ..!

-

మళయాళంలో వచ్చిన ప్రేమం సినిమాతో సౌత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ఎం.సి.ఏ తో కూడా అమ్మడి ఖాతాలో హిట్ పడ్డది. లేటెస్ట్ గా శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు సినిమాలో నటించిన సాయి పల్లవి తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన మారి-2లో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.

డిసెంబర్ 21న ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. పడి పడి లేచే మనసు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కాని మారి-2 మాత్రం కోలీవుడ్ లో యావరేజ్ గా నిలిచింది. ఇదిలాఉంటే మారి-2లో రౌడీ బేబి సాంగ్ మాత్రం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఈ సాంగ్ అఫిషియల్ వీడియో రిలీజ్ చేసిన రెండు గంటల్లోనే 1 మిలియన్ మార్క్ రాబట్టగా 3 రోజుల్లో సాంగ్ ఏకంగా 20 మిలియన్ అంటే 2 కోట్ల వ్యూస్ రాబట్టింది. అంతేకాదు 5 లక్షలకు పైగా లైకులు రాబట్టింది.

సాయి పల్లవి డ్యాన్స్ ఈ పాటకు స్పెషల్ ఎట్రాక్షన్ కాగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది. ధనుష్, సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ తో దుమ్ముదులిపేస్తున్నారంతే..

2 కోట్ల మంది ప్రేక్షకులకు నచ్చిన ఈ సాంగ్ మీరు చూసేయండి..

Read more RELATED
Recommended to you

Latest news