బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మృతి తరువాత రియాకు డ్రగ్స్ పెడ్లర్‌లతో సంబంధాలున్యాయని తేలడంతో ఆ వైపుగా నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు, పేర్లు బయటికి వస్తున్నట్టు జాతీయ మీడియా సంచలన కథనాల్ని ప్రసారం చేస్తోంది. రియా విచారణలో 25 మంది సెలబ్రిటీల పేర్లని బయటపెట్టిందని అందులో రకుల్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, దీపికా పదుకునే ల పేర్లు బయటికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అందరి దృష్టి బాలీవుడ్ వైపు మళ్లింది. తాజాగా ఈ కేసు విషయమై టాలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్ని నిర్మించిన మధు మంతెన పేరు బయటికి వచ్చినట్టు చెబుతున్నారు. తాజాగా ఆయనకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారని, ఆయన ఈ రోజు(బుధవారం) ఎన్సీబీ ముందు హాజరు కానున్నారని జాతీయ మీడియా కథనం. మధు మంతెన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు కజిన్. ఆయన రూపొందించిన `రక్తచరిత్ర`కు ఓ నిర్మాతగా వ్యవహరించారు కూడా. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించారు. ఫాంటమ్ ఫిలింస్‌ని అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, విక్రమాదిత్యతో కలిసి ఏర్పాటు చేసి సక్సెస్ ఫుల్ మూవీస్‌ని అందించారు.