జగన్ ఇటీవలే అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి కీలక చర్చలు జరిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చలు ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో ఆసక్తిని సంతరించుకున్న విషయం తెలిసిందే. కాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో మళ్లీ తిరుగు పయనమయ్యారు.
ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా తిరుపతి బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప తో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఇప్పటికే డిక్లరేషన్ పై సీఎం జగన్ అంగీకారం తెలపాలి అంటూ టిడిపి బిజెపి నేతలు తిరుపతిలో ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక్కసారిగా పోలీస్ బందోబస్తు మొత్తం అలర్ట్ అయిపోయింది.