మహేష్ కోసం అలాంటి టైటిల్..!

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా పూర్తి కాగానే అసలైతే సుకుమార్ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ఈమధ్యనే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. మహేష్ లోని కామెడీ యాంగిల్ వాడుకునేలా ఈ సినిమా ఉంటుందట.

ఈ మూవీని దిల్ రాజు, ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకరతో కలిసి నిర్మిస్తారట. పటాస్ నుండి ఎఫ్-2 వరకు అనీల్ రావిపుడి సక్సెస్ ట్రాక్ తెలిసిందే. మహేష్ సినిమాకు వాట్సాప్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడట. ఎఫ్-2 సక్సెస్ జోష్ లో ఉన్న అనీల్ తన తర్వాత సినిమానే మహేష్ తో చేస్తాడా లేక ఒక సినిమా తర్వాత మహేష్ మూవీ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news