SSMB 28 : షర్ట్ లేకుండా బాడీ చూపించిన మహేష్..ఫోటోలు వైరల్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. తాజాగా మహేష్‌ బాబు న్యూ లుక్‌ వైరల్‌ గా మారింది. అయితే… ఎన్నడూ లేని విధంగా షర్ట్‌ లేకుండా మహేష్‌ బాబు కనిపించాడు. స్విమ్మింగ్‌ ఫుల్‌ లో మహేష్‌ బాబు షర్ట్‌ లేకుండా ఉన్న ఫోటోలను స్వయంగా ఆయన సతీమణి నమ్రత షేర్‌ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి. అయితే.. ఈ లుక్‌ SSMB28 సినిమా కోసమేనని ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/CheD5Q7vaLQ/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news