మ‌హేష్‌కు డైరెక్ట‌ర్లు కావ‌లెను…!

ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ఎనౌన్స్ చేయడం మహేష్ స్టయిల్. ప్ర‌స్తుతం తాను న‌టిస్తోన్న సినిమా సెట్స్ మీద ఉండ‌గానే మో సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కు ఓకే చెప్పేస్తాడు.. ఆ వ‌ర్క్‌లో బిజీ అయిపోతాడు. ఇది గ‌త కొన్నేళ్లుగా జ‌రుగుతూనే వ‌స్తోంది. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఉంది మ‌హేష్ కెరీర్‌. మ‌హేష్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న స‌రిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ దాదాపు ఓ కొలిక్కి వ‌చ్చేసింది. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోంది. అయినా మ‌హేష్ త‌న కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత అర్జున్‌రెడ్డ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయాలి. కానీ కథ ఎంతకీ తెగలేదు. దీంతో సందీప్ మరోసారి బాలీవుడ్ కు వెళ్లిపోయాడు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నాడు. మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌రోసారి ఈ కాంబినేష‌న్ రిపీట్ చేయాల‌ని అనుకున్నాడు. అయితే ఆ క‌థ కూడా రెడీ కాక‌పోవ‌డంతో పాటు మ‌రింత టైమ్ కావాల‌ని వంశీ కోర‌డంతో ఆ ప్రాజెక్టు కూడా సెట్స్ మీద‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు.

ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మహేష్ కు కథ చెప్పాడు. కానీ ప్రస్తుతం ఈ దర్శకుడు కూడా కేజీఎఫ్2తో బిజీగా ఉన్నాడు. ఇక రాజ‌మౌళి, కొర‌టాల శివ‌తో పాటు మ‌రికొంద‌రు క్రేజీ డైరెక్ట‌ర్లు మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. పూరి ఖాళీగానే ఉన్నా మ‌నోడికి మ‌హేష్‌కు ఎక్క‌డో గ్యాప్ ఉంది. సో.. అందుబాటులో ఉన్న దర్శకులంతా టైమ్ కోరడంతో మహేష్ కూడా గ్యాప్ తీసుకోవ‌డం మిన‌హా చేసేదేం లేదు. అంటే స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌నోడు నాలుగైదు నెల‌ల‌కు పైగా ఖాళీగా ఉండాల్సినట్టుగానే కనిపిస్తోంది.