నచ్చకుండా చేసినా సూపర్ హిట్ అయిన రోల్ అది..!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించిన పాత్రలు ఇంకెవరు చేసి ఉండరని చెప్పొచ్చు. సూత్రదారులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ఇప్పటికి మంచి పాత్రలు చేస్తూ తన సత్తా చాటుతుంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించలేము. నా మాటే శాసనం.. అంటూ సింహ గర్జనగా రమ్యకృష్ణ చేసిన అభినయం సినిమాకు హైలెట్ గా నిలిచింది.

రమ్యకృష్ణ అనగానే గుర్తొచ్చే పాత్రల్లో శివగామితో పాటుగా నీలాంబరి పాత్ర గుర్తుకొస్తుంది. నరసింహా సినిమాలో నీలాంబరి సినిమాలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ పాత్రలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపం చూపించింది. అయితే ఆ పాత్ర తనకు ఇష్టం లేకుండానే చేశానని చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ.

ఆ సినిమాలో సౌందర్యను కాలితో తన్నే సీన్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డానని.. అయిష్టంగా చేసినా దర్శకుడు విజన్ సినిమాకు ఆ పాత్ర హైలెట్ గా నిలిచిందని అన్నది. మొత్తానికి ఇష్టం లేకుండా చేసినా రమ్యకృష్ణ కెరియర్ లో నీలాంబరి పాత్ర ది బెస్ట్ గా నిలిచింది.