ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్న రిషి.. మహేష్ మహర్షి ట్రైలర్.. సూపరో సూపర్..!

-

సూపర్ స్టార్ మహేష్ ల్యాండ్ మార్క్ మూవీ 25వ సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి నిర్మిస్తున్నారు. రాజకుమారుడు నుండి మహర్షి వరకు మహేష్ 25 సినిమాలు చేశాడు. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరిగింది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రాగా సర్ ప్రైజ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు.

మహేష్ నటించిన 25 సినిమాల దర్శకులతో పాటుగా కొందరు హీరోయిన్స్ కూడా స్పెషల్ గ్రీటింగ్స్ రూపంలో పంపించిన వీడియోలు ముందు ప్లే చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఏం సదిద్దామనుకుటున్నావ్ రిషి అంటే ఏలేద్దామనుకుంటున్నా సర్.. ప్రపంచాన్ని ఏలేద్దామని అనుకుంటున్నా అంటాడు. ఆ ఒక్క డైలాగ్ తో రిషి అదే మహేష్ మహర్షి స్టోరీ చెప్పేశాడు. చూస్తుంటే మహర్షి అంచనాలను అందుకోవడం కాదు రికార్డుల సంచలనాలు సృష్టించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version