మహేశ్ బాబు ‘పోకిరి’ మేనియా..రీ-రిలీజ్‌తో అన్ని కోట్లు వసూలు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మంగళవారం (ఆగస్టు 9) మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పలు థియేటర్లలో ‘పోకిరి’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ‘పోకిరి’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

మహేశ్ నటించిన ‘పోకిరి’ చిత్రానికి టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా, ఇందులో హీరోయిన్ గా ఇలియానా నటించింది. ఇక ఈ చిత్రం అప్పట్లోనే రికార్డు వసూళ్లు చేసింది. కాగా, తాజాగా రీ-రిలీజ్ సందర్భంగా కూడా రికార్డు వసూళ్లు చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ లో ఫుల్ అయిపోతున్నాయి.

మొత్తంగా 30 షోలకు అడ్వాన్స్ బుకింగ్ చేయగా, అన్నీ ఫుల్ అయిపోయాయి. ప్రసాద్ మల్టీప్లె్క్స్ లోనే 8 షఓలు వేసేందుకు రెడీ కాగా టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోయాయి. అలా మహేశ్ కొత్త చిత్రానికి ఉన్నంత క్రేజ్ ‘పోకిరి’ ఉండటం చూసి సినీ పరిశీలకులు వావ్ అంటున్నారు.

ఆస్ట్రేలియా..మెల్ బోర్న్ లోనూ ‘పోకిరి’ స్పెషల్ షో వేసుకుంటున్నారు. అండర్ కవర్ కాప్ గా మహేశ్ పర్ఫార్మెన్స్ పిక్చర్ లో అదిపోతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.కోటి గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది. మహేశ్ గత చిత్రానికే ఇంతటి క్రేజ్ ఉంటే ..ఇక భవిష్యత్తులో వచ్చే రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఫిల్మ్స్ రికార్డులు అన్నిటినీ కచ్చితంగా తిరగరాస్తాయని సినీ లవర్స్ అంటున్నారు.