నెట్ ఫ్లిక్స్ లో మహేష్ సినిమా.. రికార్డ్

-

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ అంచనాలను ఏమాత్రం అందుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో భారీగా రిలీజ్ అయిన స్పైడర్ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఆ సినిమా శాటిలైట్ రైట్స్ అందుకున్న జీ తెలుగు ప్రీమియర్స్ లో కూడా పెద్దగా టి.ఆరి.పి రేటింగ్ సాధించలేదు.

అయినా సరే ఈ సినిమా ఓ క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఆన్ లైన్ మూవీస్ పోర్టల్ నెటి ఫ్లిక్స్ లో మొదటి తెలుగు సినిమాగా ఈ స్పైడర్ ప్లే అవుతుంది. రేపటి నుండి ఆ సినిమా నెటి ఫిల్క్స్ లో ఉంటుంది. అమేజాన్, హాట్ స్టార్ ల కన్నా వరల్డ్ వైడ్ గా పెద్దదైన నెట్ ఫ్లిక్స్ ఏరి కోరి మొదటి సినిమాగా స్పైడర్ నే ఎంచుకోవడం సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.

మహేష్ సినిమానే కావాలంటే భరత్ అనే నేను కూడా ఉంది. అయితే అది అమేజాన్ ప్రైం కొనేశారు కాబట్టి స్పైడర్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. మరి నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. స్పై థ్రిల్లర్ అంటూ ఊరించి చివరకు సినిమాలో మ్యాటర్ లేకుండా చేశాడు మురుగదాస్.

Read more RELATED
Recommended to you

Latest news