‘మేజర్’ చూసి భావోద్వేగానికి గురైన సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు..

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా శుక్రవారం విడుదలైంది. పాజిటివ్ టాక్ తో ఈ ఫిల్మ్ దూసుకుపోతున్నది. హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు..‘మేజర్’ మూవీ యూనిట్ సభ్యులతో కలిసి వీక్షించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సందీప్ తండ్రి మాట్లాడుతూ తన తనయుడు సందీప్ ఉన్నికృష్ణన్ తన ఆఖరి శ్వాస వరకు దేశం కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఇంత చక్కటి సినిమా తీసిన ‘మేజర్’ మూవీ యూనిట్ సభ్యులను అభినందించారు. తన జీవితం హైదరాబాద్ లో స్టార్ట్ అయిందని, తను, తన తనయుడు సందీప్ తో ఓల్డ్ హైదరాబాద్ లో ఉన్న సంగతులను గుర్తు చేసుకున్నారు.

ఇక నుంచి హైదరబాద్ కు మళ్లీ మళ్లీ వస్తానని తెలిపారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు మాట్లాడుతూ..ఇక నుంచి ఈ సినిమా ప్రజలందరిదని తెలిపారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ సందీప్ తల్లిదండ్రులతో సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా విడుదల కాక ముందే తనకు అభినందనలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. ఈ సినిమా తీసినందకు తన గర్వపడుతున్నానని డైరెక్టర్ శశి కిరణ్ తెలిపారు.