అరుదైన మామిడిని సాగు చేసి అద్భుతాలను సృష్టించిన ఆంధ్రా రైతు..

-

కొన్ని కొన్ని పండ్లు వాటికి తగిన నేలలో మాత్రమే పండుతాయి..అందుకే మనం కావాలని అనుకుంటే మాత్రం వందలు పెట్టాల్సి వస్తుంది.ముఖ్యం ఈ సీజన్ పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.వేసవి అంటే మామిడి విరివిగా లభిస్తుంది.మన రాష్ట్రంలో దొరికే పండ్లను కాకుండా ఓ రైతు వినూత్నమైన మామిడి రకాన్ని పండిస్తున్నాడు.. అవి వేరే దేశంలో పండే మామిడి రకాన్ని సాగు చేస్తూ లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు..ఆ మామిడి గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

 

జపాన్‌లో మాత్రమే పండే ఆపిల్‌ మ్యాంగో సాగును చేపట్టాడు. కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. రెడ్‌ మ్యాంగోగా చెప్పే ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో సాగు చేస్తున్నానంటునంటున్నాడు రైతు వెంకటేశ్వరరావు. తెలంగాణలోని నర్సాపురం నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి సాగు చేస్తున్నానని తెలిపాడు. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆపిల్‌ మ్యాంగో ధర కిలో 500 నుంచి 1000 రూపాయలు పలుకుతోందని తెలుస్తుంది.

జపాన్‌ దేశానికి చెందిన ఈ మామిడి పండ్లు అచ్చం కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆపిల్‌ మ్యాంగో స్పెషాలీటిస్‌ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. షుగర్‌ కంటెంట్‌ తక్కువ, ఫైబర్‌ అధిక శాతం ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు. ఈ రెడ్ మ్యాంగ్‌ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అంటున్నాడు. అయితే, ఇది అన్ని రకాల మామిడి రకాల్లా కాకుండా ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కేజీల వరకు దిగుబడి వస్తుందని, పైగా ధర ఎక్కువగా ఉండటంతో మంచి లాభసాటిగా ఉందని చెబుతున్నాడు. ఎలాంటి కెమికల్స్‌ వినియోగించకుండా రెడ్‌ మ్యాంగో సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు.. సెంద్రీయ పద్దతులలో వ్యవసాయం చేస్తూ అద్బుతాలను సృష్టించాడు ఆంధ్రా రైతు..రాష్ట్రంలోని రైతులకు ఆదర్శంగా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news