ప్రేక్షకులను బురిడీ కొట్టించిన మల్లెమాల..ఆ విషయంలో డిసప్పాయింట్..!!

జబర్దస్త్.. ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ స్టేజ్ పై అందాల ఆరబోత చేసే యాంకర్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది ఈ యాంకర్ల కోసమే షో చూస్తారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా బుల్లితెర గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ఆమె ఎక్స్పోజింగ్ గురించి ఏ ఒక్కరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారని చెప్పవచ్చు. కేవలం జబర్దస్త్ ద్వారానే కాకుండా అటు వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వెండితెరపై హీరోయిన్ల రేంజిలో పారితోషకం తీసుకునే స్థాయికి చేరుకుంది అనసూయ.

ఇదిలా ఉండగా సినిమాలలో అవకాశాలు ఎక్కువగా రావడం , స్టార్ మా చానల్ వాళ్లు ఒక్కొక్క ఎపిసోడ్ కు నాలుగు లక్షల రూపాయలు ఆఫర్ చేయడంతో జబర్దస్త్ షో కి గుడ్ బాయ్ చెప్పింది. ఎలాగో ఎక్స్ట్రా జబర్దస్త్ కు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ కి కొత్త యాంకర్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మల్లెమాల.. అంతేకాదు గత వారం ప్రోమోలో పల్లకిలో యాంకర్ ను తీసుకొచ్చి.. కొత్త యాంకర్ అంటూ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా బిల్డప్ కూడా చేశారు మల్లెమాల యూనిట్.. కానీ ఎట్టకేలకు ఎపిసోడ్లో యాంకర్ ఎవరో రివిల్ చేసి అందర్నీ డిసప్పాయింట్ చేసింది మల్లెమాల.

ఇక అక్కడ వచ్చింది ఎవరో కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ నే.. గురువారం వచ్చే జబర్దస్త్ కు నేనే… శుక్రవారం వచ్చే ఎక్స్ట్రా జబర్దస్త్ కు నేనే అని ఆమెతో డైలాగ్ చెప్పించినా పెద్దగా పేలలేదని చెప్పవచ్చు. ఇక ప్రేక్షకులు మాత్రం గురువారం, శుక్రవారం రెండు రోజులూ యాంకర్ రష్మీ నే చూడాలా అంటూ పెదవి విరుస్తున్నారు అంతేకాదు మల్లెమాల ఇందుకోసం అంత బిల్డప్ ఇవ్వాలా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.