Exclusive : టైటిల్ షార్ట్ కట్.. కంటెంట్ ఖతర్నాక్..!

-

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది.. ఇవాళ ఉన్న ట్రెండ్ రేపు ఉండదు.. రేపు ఉన్నది ఎళ్లుండి ఉండదు. అభిమానుల అంచనాలను అందుకునేలా.. నిర్మాతల తాలూఖా బిజినెస్ వ్యవహారాలను సాటిస్ఫై చేసేలా.. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా తమ ప్రెజెన్స్ ఉండేలా చేసుకునే స్టార్స్ వారందరు పడిన కష్టానికి హిట్టు పడితే మాత్రం ఫలితం ఎక్కువ మొత్తంలో అనుభవించేది ఒక్క హీరో మాత్రమే.

సినిమాకు ఎక్కువ కష్టపడేది హీరోనే. ఇక లేటెస్ట్ గా హీరోలు కొంత ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కొత్తతరహాలో సినిమా సక్సెస్ అయితే అదే పంథాలో వీళ్లు వెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న నయా ట్రెండ్ షార్ట్ కట్ టైటిల్. అది కూడా ఇంగ్లీష్ లెటర్స్ ను పెట్టడం. లాస్ట్ ఇయర్ వచ్చిన కె.జి.ఎఫ్ తో ఈ ట్రెండ్ కు శ్రీకారం పడ్డదని చెప్పొచ్చు.

కన్నడలో KGF సంచలనాలు :

కంటెంట్ కు తగ్గ టైటిల్ ఉంటేనే సినిమా హిట్.. కె.జి.ఎఫ్ టైటిల్ కు తగినట్టుగానే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఓ యోధుడు ఎలా వారి తలరాతని మార్చి సంచలనాలు సృష్టించాడో చూపించారు. కన్నడ పరిశ్రమలో కనివిని ఎరుగని రీతిలో కె.జి.ఎఫ్ రికార్డులు సృష్టించింది.

NGK వస్తున్న సూర్య: 

ఇక అదే పంథాలో వస్తున్న మరో సినిమా సూర్య ఎన్.జి.కే. సూర్య హీరోగా వస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ చేస్తున్న సినిమాకు ఆర్.ఆర్.ఆర్ అని పెట్టారు. పేర్లు కలిసి వచ్చేలా కావాలని పెట్టారో ఏమో కాని ఆర్.ఆర్.ఆర్ అదొక సంచలనంగా మారింది.

RRR ఇది అరాచకమే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిస్తే : 

ఈ కొత్త టైటిల్ ఇంగ్లీష్ షార్ట్ కట్ ట్రెండ్ ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాని టైటిల్ షార్ట్ కట్ గా ఉన్నా వీటిలో కంటెంట్ విషయంలో మాత్రం ఆలోచించాల్సిన పనిలేదు. సూర్య ఎన్.జి.కె కూడా సూపర్ హిట్ అయితే.. ఆర్.ఆర్.ఆర్ కు ఈ టైటిల్ సెంటిమెంట్ బోనస్ అవుతుంది. రాబోతున్న రోజుల్లో ఈ ఇంగ్లీష్ షార్ట్ కట్ టైటిల్స్ లో తెలుగులో ఎన్ని సినిమాలు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news