ఒక్క మిస్డ్ కాల్.. అతడి జీవితాన్నే నాశనం చేసింది.. 5 లక్షలు గోవిందా..!

-

నాగరాజు అనే వ్యక్తి తిరుపతిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే మనోడి ఫోన్‌కు నెల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. అదే ఇప్పుడు మనోడి కొంప ముంచింది. మిస్డ్ కాల్‌ను చూసిన నాగరాజు ఎవరో అనుకొని తిరిగి కాల్ చేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఒక్క మిస్డ్ కాల్ ఏం చేస్తుంది అని అంత ఈజీగా తీసిపారేయకండి. ఒక్క మిస్డ్ కాల్ అతడి జీవితాన్నే నాశనం చేసింది. 5 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. అలా ఎలా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకండి. తెలుసుకుందాం పదండి…

అది ఏపీలోని అనంతపురం.. అదే జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తిరుపతిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే మనోడి ఫోన్‌కు నెల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. అదే ఇప్పుడు మనోడి కొంప ముంచింది. మిస్డ్ కాల్‌ను చూసిన నాగరాజు ఎవరో అనుకొని తిరిగి కాల్ చేశాడు.

అవతలి వ్యక్తి తన పేరు నాగరాజు అని పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే.. ఒకరి ముఖాలు మరొకరు మాత్రం చూసుకోలేదు. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే కొన్ని రోజుల క్రితం నాగరాజుకు రమేశ్ ఫోన్ చేశాడు. చేసి.. తనకు అర్జెంట్‌గా 5 లక్షల రూపాయలు కావాలని రిక్వెస్ట్ చేశాడు. చాలా బతిమిలాడాడు. ఒక వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. దీంతో తన ఫ్రెండే కదా.. అనుకొని అక్కడా ఇక్కడా అప్పు చేసి 5 లక్షలు రమేశ్ అకౌంట్‌కు పంపించాడు. వారం తర్వాత రమేశ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

దీంతో భయపడిపోయిన నాగరాజు వెంటనే రాయదుర్గం వెళ్లాడు. అక్కడ రమేశ్‌ను ఎలా పట్టుకోవాలో తెలియక.. నేరుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూశారా.. ఒక్క మిస్డ్ కాల్.. మనోడి జీవితాన్ని ఎలా నాశనం చేసిందో. మీరు కూడా ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడైనా కాస్త ఆలోచించండి.

Read more RELATED
Recommended to you

Latest news