మారుదాం బాస్ ప్లీజ్‌!

-

భార‌త స్త్రీ అంటే ప్ర‌పంచ దేశాల‌న్ని శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తాయి ఇది ప్ర‌తి సినిమాలో స‌గ‌టు ప్రేక్ష‌కుడు విన్న మాట.. చ‌ట్ట స‌భ‌ల్లో ప్ర‌తీ రాజ‌కీయ నాయ‌కుడు అన్న మాట‌. కానీ ఇప్పుడ‌ది మాయ‌మౌతోంది. భార‌త స్త్రీ అంటే గౌర‌వం వుంది ఇత‌ర దేశాల‌కే కానీ మ‌న‌కు కాద‌న్న సంఘ‌ట‌న‌లు దేశంలో కో కొల్ల‌లు జ‌రుగుతూనే వున్నాయి.

నిర్భ‌య‌, దిశ‌.. ఇలా ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా యువ‌తుల‌పై మార‌హోమం ఆగ‌డం లేదు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న మాన‌వ‌త్వానికి మాయ‌ని మ‌చ్చ‌గా మారింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. రాత్రికి రాత్రి బాధితురాలికి పోలీసులే అంత్ర‌క్రియ‌లు జ‌ర‌ప‌డం క‌ల‌క‌లంగా మారింది. ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న‌పై సెల‌బ్రిటీతో పాటు సామాన్యులు మండి ప‌డుతున్నారు. హీరో మంచు మ‌నోజ్ ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు.

ఆడ‌ది అర్థ్ర రాత్రి స్వేచ్ఛ‌గా తిర‌గ‌గ‌లిగిన‌ప్పుడే దేశానికి అస‌లైన స్వాతంత్య్రం వ‌చ్చిన‌ట్ట‌ని గాంధీజీ అన్నారు. కానీ ప‌ట్ట‌ప‌గ‌లే అత్య‌చారాలు జ‌రుగుతున్న‌ప్పుడు ఏడాదికోసారి గాంధీ జ‌యంతి పేరుతో సెల‌విచ్చి శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డంతో అర్థం లేదు. మ‌న‌కు బాపూజీ క‌రెన్సీ మీద ఓ డిజైన్ మాత్ర‌మే. మారుదాం బ్ర‌ద‌ర్ ప్లీజ్‌`అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news