RRR కి ఆస్కార్ రావాలని ప్రార్థిస్తున్నా – మంచు విష్ణు

-

ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ఆశలు సజీవంగానే మిగిలి ఉన్నాయి. ఈ చిత్రం విడుదలై ఏడు నెలలు దాటినా సినిమా హవా మాత్రం ఇంకా తగ్గలేదు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు ఈ చారిత్రక చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ రావాలంటే సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు.

మన దేశం తరఫున ఆస్కార్ పురస్కారాలకు పంపడానికి జ్యూరీ తిరస్కరించినప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తన ప్రయత్నాలని కొనసాగిస్తోంది. నేరుగా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుందిి. దాదాపు అన్ని ప్రధాన విభాగాలలో నామినేషన్ల కోసం దరఖాస్తు చేసినట్లు ఆర్ఆర్ఆర్ బృందం తెలిపింది. ఆయా దేశాలకు చెందిన జ్యూరీ ఆమోదం లేనప్పటికీ, కొన్నిసార్లు సాధారణ కేటగిరీలో దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకుంటుంది ఆస్కార్ కమిటీ.

అలా ఈ సినిమాకి కూడా నామినేషన్లు దక్కే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో “మా” అధ్యక్షుడు హీరో మంచు విష్ణు “RRR” చిత్రానికి ఆస్కార్ రావాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు మంచు విష్ణు కి థాంక్స్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news