ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచావా..? నీహారిక‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

-

ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కుమార్తె నీహారిక వైజాగ్ బీచ్‌ ఫొటోల్లో ఒక పొడ‌వాటి తెల్ల‌ని చొక్కా వేసుకుని ఉంది. కింద షార్ట్స్ వేసుకుంది కానీ అవి క‌నిపించ‌డం లేదు. దీంతో ఆ ఫొటోల‌ను చూసిన మెగా అభిమానులు నీహారిక‌ను విమ‌ర్శిస్తున్నారు.

ప‌లు వెబ్ సిరీస్ మొద‌లు కొని.. టీవీ షోలు.. ఒక‌టి, రెండు సినిమాల్లో న‌టించినప్ప‌టికీ మెగా హీరోయిన్ కొణిదెల నిహారిక‌కు మాత్రం చ‌క్క‌ని బ్రేక్ రాలేదు. దీంతో నిహారిక త‌న సినీ కెరీర్‌పై కొంత ఆందోళ‌న‌లో ఉండ‌గా.. ఇప్పుడు ఆమె మెగా ఫ్యాన్స్ చే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. అయితే అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. సాధార‌ణ హీరోయిన్ల మాదిరిగా నీహారిక కూడా గ్లామ‌ర్ డ్రెస్ వేసుకుని స్కిన్ షో చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు నిహారిక‌పై మండిప‌డుతున్నారు.

ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కుమార్తె నీహారిక ఈ మ‌ధ్యే వైజాగ్ బీచ్‌లో స‌ర‌దాగా గ‌డిపింది. దానికి సంబంధిన ఫొటోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో నీహారిక ఒక పొడ‌వాటి తెల్ల‌ని చొక్కా వేసుకుని ఉంది. కింద షార్ట్స్ వేసుకుంది కానీ అవి క‌నిపించ‌డం లేదు. దీంతో ఆ ఫొటోల‌ను చూసిన మెగా అభిమానులు నీహారిక‌ను విమ‌ర్శిస్తున్నారు.

View this post on Instagram

Nothing like a good beach day! ? . ? Amma?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

మెగా కుటుంబం నుంచి వ‌చ్చి వారి ప‌రువు తీసేలా డ్రెస్ వేసుకుంటావా..? అంటూ మెగా ఫ్యాన్స్ నీహారిక‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. చ‌క్క‌ని దుస్తులు వేసుకోవ‌చ్చు క‌దా అని చెప్పి వారు నీహారిక‌కు క్లాస్ తీసుకుంటున్నారు. పైన ష‌ర్ట్ ఓకే.. కానీ కింద ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా.. అంటూ ప‌లువురు కామెంట్లు చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా నీహారిక ప్ర‌స్తుతం ఓ నూత‌న వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news