జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఫిల్మ్ ఇనిస్ట్యూట్

-

జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో పాల‌కొల్లులో ఫిలిం ఇనిస్ట్యూట్ నిర్మాణం కానుందా? చేగొండి చైర్మ‌న్ గా కార్య‌క‌పాలు సాగించ‌నుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఈ ఇనిస్ట్యూట్ నిర్మాణం కానుంద‌ని మెగా కాపౌండ్ వ‌ర్గాలు తెలిపాయి. అల్లు రామ‌లింగ‌య్య‌, దాస‌రి నారాయ‌ణ‌రావు, కోడి రామకృష్ణ వంటి ప్ర‌ముకుల‌కు చెందిన జిల్లా కావ‌డంతో అక్క‌డ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఇనిస‌ట్యూట్ కు ఎస్ వి. రంగారావు స్కూల్ అని నామ‌క‌ర‌ణం చేయ‌నున్నారు. మాజీ మంత్రి చేగొండ్డి హ‌రిరామ‌య్య జోగ‌య్య దీనికి చైర్మెన్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌న‌న్నారు. రాజా వ‌న్నెంరెడ్డి, బ‌న్నీ వాసుల ఆధ్వ‌ర్యంలో ఇది న‌డవ‌నుంది.

, యాక్టింగ్ , డైరరెక్ష‌న్ త‌దిత‌ర కోర్సుల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. జ‌న‌సైనుకుల ఫీజ్ లో రాయితీ క‌ల్పించ‌నున్నారు. మ‌రి జ‌న‌సేన అనేరాజ‌కీయ పార్టీకి…ఫిల్మ్ ఇనిస్ట్యూట్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇది కేవ‌లం పార్టీ పేరు మీద‌…ప‌వ‌న్ బ్యాకెండ్ మాత్ర‌మే ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ ప్రాస్ట‌క్చ‌ర్ అంతా ఏర్పాటు చేసేది కేవ‌లం బ‌న్నీ వాసు మాత్ర‌మే. ప‌వ‌న్ అనుమ‌తి, సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుని ఇనిస్ట్యూట్ ఏర్పాటు చేస్తున్నాడు. కేవ‌లం ప‌వ‌న్ పేరును ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి అన్న కార‌ణంగానే వాడుకుంటున్నారు. పార్టీకి బ‌న్నీ వాసు చేసిన సేవ‌లు గుర్తించే ప‌వ‌న్ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ‌న్నీ వాసు పాల‌కొల్లు టిక్కెట్ ఆశించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఇవ్వ‌లేక పోయారు.

ఇక బ‌న్నీవాసుకు మెగా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు అన్న సంగ‌తి తెలిసిందే. మెగా కాంపౌండ్ లోకి మేనేజ‌ర్ గా ప్ర‌వేశించి అల్లు అర‌వింద్ అండ‌దండ‌ల‌తో నిర్మాత‌గా ఎదిగాడు. అటుపై బ‌న్నీతో స్నేహం ఏర్ప‌డింది. బ‌న్నీ చిన్న నాటి నుంచి తెలిసిన వ్య‌క్తి. అందుకే వాసు పేరుకు ముందు బ‌న్నీ అని పెట్టుకున్నాడు. అక్క‌డ నుంచి ప‌వ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ భ‌ద్ర‌తా సిబ్బందికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని బ‌న్నీ వాసు చూసుకుంటాడు. అలా ప‌వ‌న్ తో ర్యాపో ఏర్ప‌డింది. అందుకే ప‌వ‌న్ బ‌న్నీ వాసుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news