వాయిదా పడ్డ ఆచార్య మూవీ.. రిలీజ్ అప్పటికే!

కరోనా దెబ్బకు టాలీవుడ్ కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పలు పెద్ద సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. మరి కొన్ని సినిమాలు షూటింగ్ నిలిపివేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సినిమాలు కూడా షూటింగ్ లు ఆపేసి మరీ తమ విడదల తేదీలను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే సర్కారువారి పాట, ఆర్ ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి మూవీలు షూటింగులను ఆపేశాయి.

మరోవైపు షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాటపర్వం లాంటి సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తాయో తేదీలను ప్రకటించలేదు. కాకపోతే కొవిడ్ ఎఫెక్ట్ తగ్గాకే అనౌన్స్ చేస్తామని మాత్రం తెలిపాయి. ఇప్పుడు ఇదే బాటలోకి చిరు కూడా పయనిస్తున్నాడు. ఆచార్య మూవీలో ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఓ పాట అంచనాలు పెంచేశాయి. కాగా కొవిడ్ ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిదే. దీంతో ముందుగా అనుకున్న మే14న సినిమాను విడుదల చేయలేకపోతున్నామని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అందువల్ల సినిమాను వాయి వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అయితే దీనికి సంబంధించి మరో వార్త చెక్కర్లు కొడుతోంది. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేస్తారని సమాచారం. అప్పటి వరకు ఎలాగూ కొవిడ్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి అప్పుడే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.