‘ఫసక్’ ట్రెండింగ్ పై మోహన్ బాబు ఏం ట్వీట్ చేశాడంటే…!

-

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఇప్పటికీ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన నటన కన్నా.. డైలాగులకు ఎక్కువగా పవర్ ఉంటుంది. ఏకధాటిగా డైలాగులను చెప్పడంలో దిట్ట ఆయన. అందుకే ఆయన్ను డైలాగ్ కింగ్ ముద్దుగా పిలుస్తుంటారు ఆయన అభిమానులు.

ఇక.. అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా మోహన్ బాబు తన కూతురుతో కలిసి ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంలో తను నటించిన ఓ సినిమాలోని డైలాగ్ ను ఇంగ్లీష్ లో చెబుతాడు. అప్పుడే ఫసక్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు మోహన్ బాబు. అంతే.. అప్పటి నుంచి ఫసక్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. గూగుల్ లో ఆ పదం అర్థం ఏంటా? అని చాలామంది వెతకడం, ఫసక్ హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఫసక్ అనే పదం టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

అంతే కాదు.. ఫసక్ తో చాలా ఫన్నీ వీడియోలు కూడా వచ్చాయి. దీంతో ఆశ్చర్యానికి లోనయిన మోహన్ బాబు ఈ ఫసక్ పై ట్వీట్ చేశాడు. అయితే.. నెటిజన్లు మోహన్ బాబుపై ట్రోలింగ్ చేస్తున్నా ఆయన మాత్రం ఏమాత్రం కొప్పడకుండా.. సరదాగా ట్వీట్ చేశాడు.

ఫసక్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందని తెలుసుకోవడం ఎంతో బాగుంది. ఇప్పటి వరకు ఫసక్ పదం మీద 200 వరకు ఫన్నీ వీడియోలు వచ్చాయని విష్ణు చెప్పాడు. కొన్ని వీడియోలు చూశాను.. ఫన్నీగా, వినూత్నంగా ఉన్నాయి. అంటూ ట్వీట్ చేశాడు మోహన్ బాబు. వావ్.. మోహన్ బాబు తనపై చేస్తున్న ట్రోలింగ్ ను కూడా పాజిటివ్ గా తీసుకొని మెచ్చుకోవడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news