నాగార్జునతో నటించాలని ఉందని తన మనసులో మాటలను బయటపెట్టింది ప్రియాంక. నాగార్జున అంటే ప్రియాంకకు చాలా ఇష్టమట.
తెలుగు ఆడపడుచులకు ఈమె పేరు సుపరిచతమే. తెలుగు సీరియళ్లు చూసేవాళ్లకు కూడా ఆమె సుపరిచితురాలే. తన మౌనంతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మౌనరాగం సీరియల్ హీరోయిన్ అమ్ములు.. అసలు పేరు ప్రియాంక జైన్ రియల్ స్టోరీ తెలుసుకుందాం పదండి.
నిజానికి ఆమె మౌనరాగం సీరియల్ లో మాట్లాడదు. కానీ.. ఇంటర్వ్యూలో మాత్రం గడగడలాడించేసింది. మొదటి సారిగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక తన గురించి ప్రేక్షకులకు బోలెడు విషయాలు తెలియజేసింది.
తనది ఏ ఊరో తెలుసా?
తెలుగులో గడగడా మాట్లాడుతున్న ప్రియాంక జైన్ నిజానికి తెలుగు అమ్మాయి కాదు. ముంబైలో పుట్టి పెరిగి.. తర్వాత బెంగళురుకు షిప్ట్ అయి ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయిన ప్రియాంక జైన్ ఈ సీరియల్ లో నటించడానికి ముందే కన్నడలో ఓ సినిమా చేసింది. గోలీసోడా సినిమాలో నటించింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది ప్రియాంకా. చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా లాంటి సినిమాల్లో నటించిన ప్రియాంకకు తర్వాత మౌనరాగం సీరియల్ లో నటించే అవకాశం లభించిందట.
నాగార్జునతో నటించాలనుంది..
తెలుగు సినిమాల్లో నటించాల్సి వస్తే.. నాగార్జునతో నటించాలని ఉందని తన మనసులో మాటలను బయటపెట్టింది ప్రియాంక. నాగార్జున అంటే ప్రియాంకకు చాలా ఇష్టమట. అందుకే.. ఆయన సినిమాలో చిన్న రోల్ కు అవకాశం వచ్చినా సంతోషంగా చేస్తానని చెప్పింది ప్రియాంక.
తన లైఫ్ గోల్స్ గురించి… తన సినీ కెరీర్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పింది ప్రియాంకా జైన్. ఇంకా తన లైఫ్ గురించి ఏం చెప్పిందో మీరు ఈ వీడియోలో చూసేయండి.