చైనా చక్రవర్తులు 15 రోజుల్లో మొత్తం 121 మంది స్త్రీలతో శయనించేవారని చరిత్ర చెబుతోంది. ప్రాచీన చైనాకు చెందిన కొందరు చక్రవర్తులను తీసుకుంటే వారు.. నిర్దిష్టమైన రోజుల్లో నిర్దిష్టమైన సంఖ్యలో ఉన్న స్త్రీలతో శృంగారంలో పాల్గొనేవారట.
భారతీయులు మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ప్రజలు గణిత శాస్త్రంలోని అంకెలను తమకు అదృష్టాన్ని, దురదృష్టాన్ని తెచ్చేవిగా నమ్ముతారు. కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు కొన్ని అంకెలను అదృష్టంగా భావిస్తే మరికొందరు కొన్ని అంకెలను తమకు దురదృష్టం తెచ్చి పెడతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే చైనా వాసుల విశ్వాసాలను పరిశీలిస్తే వారి నమ్మకాలు ఇతర దేశాలకు భిన్నంగా ఉంటాయి. వారు 4 అంకెను చెడు చేస్తుందని భావిస్తారు. అదే 8 అంకె తమకు అదృష్టం తెచ్చి పెడుతుందని నమ్ముతారు. అలాగే అమెరికా వాసులు 9 అంకెను కీడుగా భావిస్తారు. భారతీయులు 9 అంకెను అదృష్టమని నమ్ముతారు. ఇలా ప్రపంచంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు అంకెలను భిన్నంగా చూస్తారు.
చైనా వాసుల విషయానికి వస్తే.. పురాతన కాలంలో చక్రవర్తులు ఈ అంకెలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చేవారట. వారు ఏ సమయంలో ఏ పని చేయాలన్నా అదృష్టమైన అంకెతోనే చేసే వారట. అంటే ఉదాహరణకు.. ప్రాచీన చైనాకు చెందిన కొందరు చక్రవర్తులను తీసుకుంటే వారు.. నిర్దిష్టమైన రోజుల్లో నిర్దిష్టమైన సంఖ్యలో ఉన్న స్త్రీలతో శృంగారంలో పాల్గొనేవారట. ఒక రోజు ఒకరు, ఒక రోజు ముగ్గురు, ఒక రోజు 9 మంది.. ఇలా ఒక్కో రోజు భిన్నమైన సంఖ్యలో స్త్రీలతో శృంగారం చేసేవారట.
మొదటి రోజును చైనా చక్రవర్తి మహారాణితోనే శృంగారం చేసేవారట. అలాగే రెండో రోజు రాత్రి ముగ్గురు సీనియర్ సహధర్మచారిణిలతో, మూడో రోజు 9 మంది భార్యలతో శృంగారం చేసేవారట. అలాగే ఆపైన వచ్చే రోజుల్లో 3 రోజుల పాటు ఒక్కో రోజుకు 9 మంది చొప్పున, ఆ తరువాత 9 రోజుల పాటు రోజుకు 9 మంది చొప్పున చక్రవర్తులు శృంగారం చేసేవారట. అయితే మూడో రోజు దాటాక మిగిలిన రోజుల్లో చక్రవర్తులు తమ అంతఃపురంలో ఉండే ఉంపుడు గత్తెలు, బానిస స్త్రీలతోనే శృంగారం చేసేవారట. కేవలం పౌర్ణమి రోజుల్లోనే మహారాణులు, ఇతర భార్యలతో శృంగారంలో పాల్గొనేవారట. అందుకు కారణం కూడా ఉంది.
పౌర్ణమి రోజుల్లో మహారాణి, ఇతర భార్యలకు శక్తి ఎక్కువగా ఉంటుందని, ఆ రోజుల్లో శృంగారం చేస్తే చక్కని సంతానం కలుగుతుందని భావించేవారట. అందుకనే చైనా చక్రవర్తులు పౌర్ణమి ఆరంభంలో మహారాణితో మొదలు పెట్టి అమావాస్య దగ్గర పడుతున్న కొద్దీ స్త్రీలను మారుస్తూ శృంగారం చేసేవారు. అమావాస్య దగ్గర్లో, అమావాస్య అప్పుడు కేవలం బానిస స్త్రీలతోనే శృంగారం చేసేవారట. తిరిగి పౌర్ణమి మొదలవ్వగానే పైన చెప్పిన రొటేషన్ విధానం కొనసాగుతుంది. ఇలా చైనా చక్రవర్తులు 15 రోజుల్లో మొత్తం 121 మంది స్త్రీలతో శయనించేవారని చరిత్ర చెబుతోంది. అయితే కేవలం పైన చెప్పిన విషయంలోనే కాదు, పరిపాలన, ఇతర వ్యవహారాల విషయంలోనూ చైనా చక్రవర్తులు గణిత శాస్త్రాన్ని, అంకెలను బాగా నమ్మేవారని కూడా చరిత్ర చెబుతోంది.