మాల్దీవ్స్‌కు క్యూ కడుతున్న సినీ సెలబ్రిటీస్‌..కారణం ఇదే

పూరీ జగన్నాథ్‌తో బ్యాంకాక్‌ ఫేమస్‌ అయితే.. మన సినిమా సెలబ్రిటీస్‌తో మాల్దీవ్స్ పేరు మారుమోగిపోతోంది. హాలిడే ట్రిప్‌ కోసం అమెరికానో.. స్విర్జర్లాండో.. పారిసో వెళ్లే మన సెలబ్రిటీలు మాల్దీవ్స్‌ బాట పట్టారు. ఏ హీరోయిన్ ఇన్‌స్టా ఓపెన్‌ చేసినా.. మాల్దీవ్స్ ఫొటోలు వీడియోలే. బాలీవుడ్‌.. టాలీవుడ్‌ అన్న తేడా లేకుండా.. అందరూ.. మాల్దీవ్సే ఎందుకు వెళ్తున్నారు. మన సెలబ్రిటీస్‌కు ఈ ఐలండ్‌ ఎందుకంత బాగా నచ్చేసింది. మిగిలిన చోట లేనిది .. అక్కడ వున్నదేంటి ?

ఈమధ్యనే పెళ్లయిన కాజల్‌ హనీమూన్‌ స్పాట్‌ కోసం సెర్చ్‌ చేసి చేసి.. చివరికి మాల్దీవ్స్‌ను ఫిక్స్‌ చేసింది. ప్రియురాలు దిశాతో కలిసి హాలిడే ట్రిప్‌ వేయాలనుకున్నాడు టైగర్‌ ష్రాఫ్‌. మాల్దీవ్స్‌లో ప్రైవసీ దొరికింది. పెళ్లయిన నేహా ధూపికా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుని.. మాల్దీవ్స్‌ను చూజ్‌ చేసుకుంది. సింగిల్‌గా వున్న కత్రినాకైఫ్‌ కాలక్షేపం అక్కడే. మెహ్రీన్‌ పుట్టిన రోజు వేడుకను వేదికైంది. ఇక రకుల్‌ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలనుకుని మాల్దీవ్స్‌ చెక్కేసింది.

ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌ వేయాలనుకున్న రకుల్‌ ప్రస్తుతం మాల్దీవ్స్‌ విహరిస్తోంది. అమ్మానాన్న.. ఓ తమ్మడుతో కలిసి దిగిన ఫొటోలు… వీడియోలు షేర్ చేసింది. అందమైన జ్ఞాపకాలతో అజయ్‌దేవగణ్‌ మేడే’ సెట్‌లో డిసెంబర్‌లో అడుగుపెట్టనుంది రకుల్‌. కరోనా సీజన్‌లో బర్త్‌డే వేడుకను ఘనంగా.. డిఫరెంట్‌గా మాల్దీవ్స్‌లో జరుపుకున్న మెహ్రీన్‌.. అక్కడ సైక్లింగ్ చేస్తూ.. గడిపేసింది.

ఇక తాప్సి అయితే.. బికినీ సాంగ్‌ పాడడంతోపాటు.. బీచ్‌ అందాలతోపాటు.. సముద్రగర్భంలో బ్యూటీని కూడా తిలకించి వచ్చింది. ప్రియుడు గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్‌.. హానీమూన్‌ స్పాట్‌గా మాల్దీవ్స్‌ను ఫిక్స్‌ చేసుకుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు షేర్‌ చేస్తూ.. ఎంజాయ్‌ చేసింది చందమామ. ఇలా ఒకరేంటి.. మౌని రాయ్‌.. కత్రినా కైప్.. నేహా ధూపియా వంటి సెలబ్రిటీస్‌ మాల్దీవ్స్‌నే ఎంచుకున్నారు. లవర్స్‌కు.. ఫ్యామిలీకి .. సోలోగా వెళ్లినా.. కావాల్సినంత ప్రైవసీ అక్కడ దొరుకుతుందట. 1200 దీవుల సముదాయమైన మాల్దీవ్స్‌లో 25 దీవులను టూరిజం కోసం డెవలప్‌ చేశారు. అన్ని చోట్లా ఫైవ్‌ స్టార్‌ ఫెసిలిటీ వుంది.

సెలబ్రిటీస్‌ అనే కాదు.. సామాన్యులకు కూడా కావాల్సినంత భద్రత వుండడంతో అందరూ మాల్దీవ్స్‌ లో దిగేస్తున్నారు. వీసా లేకుండా.. 30 రోజులు గడిపే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. స్థాయికి తగ్గట్టు ఫుడ్‌.. హోటల్స్ అందుబాటులో వున్నాయి. ఇన్ని సదుపాయాలు.. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో అద్భుతాలను మన సెలబ్రిటీస్‌ వదులుకుంటారా. అందుకే.. ఈమధ్య మాల్దీవ్స్ మన హీరోహీరోయిన్లతో నిండిపోతోంది.