‘Miss.శెట్టి Mr.పొలిశెట్టి’ టీజర్ విడుదల

-

తెలుగులో స్టార్ హీరోయిన్ గా… లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి… ప్రస్తుతం మరో మూవీకి సిద్ధమవుతోంది. గత ఏడాది నిశ్శబ్దం సినిమాతో… నిరాశపరిచిన ఈ అమ్మడు.. తాజాగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 14 పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తెర కెక్కుతోంది.

ఈ సినిమాకు ‘Miss.శెట్టి Mr. పోలిశెట్టి’ టైటిల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘Miss.శెట్టి Mr. పోలిశెట్టి’ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అనుష్క చెఫ్ గా, నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పి.మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో జయసుధ, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news