చైతు.. రవితేజ.. లైన్ క్లియర్

-

శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ఈ నెల చివరన రాబోతున్న నాగ చైతన్య మరోపక్క చందు మొండేటి డైరక్షన్ లో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉండగా ఫైనల్ గా నవంబర్ 2న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారట. అంతేకాదు మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారట.

ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు నిర్మించేది మైత్రి మూవీ మేకర్సే. మారుతి డైరక్షన్ లో సినిమా కాబట్టి శైలజా రెడ్డి అల్లుడు మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఆ సినిమా వెంటనే సవ్యసాచి రావడం మంచిదే. ఇక నేలటిక్కెట్టు డిజాస్టర్ తర్వాత రవితేజ చేస్తున్న సినిమాగా వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా శ్రీను వైట్ల డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తుంది. రవితేజకు ఈ సినిమా ఫలితం మీద తన కెరియర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version