తెలుగు సినిమా బ్యాన్‌ చేయండి : నాగబాబు సంచలనం

-

టాలీవుడ్ సినిమాల పై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల రేట్లపై తగ్గింపుపై నాగబాబు స్పందిస్తూ… తెలుగు సినిమాలను ఆంధ్రాలో బ్యాన్ చేయండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“తెలుగు సినిమాలను ఆంధ్రాలో బ్యాన్ చేస్తే నాకేం నష్టం లేదు. కొన్ని రోజులు నష్టపోయినా యూట్యూబ్, ఓటీటీ అలాగే డిజిటల్ మీడియా ద్వారా మాకు డబ్బులు వస్తాయి. ఆంధ్ర లో హాలీవుడ్ సినిమాలను పది రూపాయలకి చూపించగలరా ? చిరంజీవి గారు సీఎం తో మాట్లాడిన ఎందుకు జీవో ఇవ్వలేదు. మా ఆర్థిక మూలాలను కొట్టాలని చూస్తున్నారు. అలా జరగదు. జరగనివ్వం.”అంటూ మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మంచిగా పాలిస్తే తాము సంతోషిస్తామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో జగన్‌ సర్కార్‌ సహకరించకపోయినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఫుల్‌ సపోర్టు గా ఉందన్నారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news