సుధీర్ కి 8 ఏళ్ల క్రితమే చెప్పా అంటున్న నాగబాబు.. కారణం..?

ఒకప్పుడు రామోజీరావు ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత వేణు సహాయంతో జబర్దస్త్ కమెడియన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ టీం లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న సుధీర్.. పై ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం ఉంది.. ఇతడిలో చాలా టాలెంట్ ఉందని మొదటి నుండి కామెంట్లు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బుల్లితెరపై మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలలో నటించాడు. అయితే ఇతనికి హీరోగా సినిమా అవకాశాలు లభిస్తున్నాయి.. కానీ అన్ని నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు.

సాఫ్ట్వేర్ సుధీర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని గాలోడు సినిమాతో హీరోగా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు సుధీర్. ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి.. అన్ సీజన్లో కూడా గాలోడు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది అంటే అది కేవలం సుదీర్ కి ఉన్న క్రేజ్ వల్లే సాధ్యమైందని కొంతమంది చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు తాజాగా గాలోడు సినిమా ఫలితం గురించి అలాగే సుధీర్ టాలెంట్ గురించి నాగబాబు స్పందించాడు.

“సుధీర్ నటించిన గాలోడు సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇతడు మాస్ హీరో అయిపోయాడు అతను మాస్ హీరో అవుతాడని నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే చెప్పాను.. ఇప్పుడు అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎవరైతే ఇలా కష్టపడతారో వాళ్లకు తప్పకుండా విజయం వరిస్తుంది.. సుదీర్.. హార్డ్ వర్క్ ను మాత్రం వదలొద్దు” అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ లో చేస్తున్నప్పుడు నాగబాబు సుదీర్ పై ప్రశంసల వర్షం కురిపించేవాడు.. అలాగే సుధీర్ కూడా నాగబాబుని డాడీ అంటూ పలకరించేవాడు. మొత్తానికి అయితే సుధీర్ గురించి నాగబాబు చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.