మీరొక్కల్లే సూపర్ స్టార్స్ కాదు.. నాగబాబు కామెంట్ 2..!

-

బాలకృష్ణ మీద నాగబాబు చేస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొదట సరదాగా మొదలు పెట్టిన ఈ ఇష్యూ పెద్దదిగా మారింది. ఈ విషయంపై నాగబాబు మరోసారి రెస్పాండ్ అవుతూ పార్టు పార్టులుగా బాలకృష్ణ మీద ఎటాక్ చేస్తున్నాడు. కామెంట్ 1 లో మీరు ఇండస్ట్రీలో ఉంటూ ఒక స్టార్ హీరో ఎవరో తెలియదని చెప్పొచ్చు.. మీ బావ అవసరానికి వాడుకుని వదిలేయొచ్చు లాంటి మాటలతో సరిపెట్టాడు. ఇక కొద్దిసేపటి క్రితం నాగబాబు కామెంట్ 2 వీడియో పెట్టారు.

ఇండస్ట్రీలో మీరు మాత్రమే సూపర్ స్టార్స్ కాదు ఇక్కడ చాలా మంది స్టార్స్ ఉన్నారు. మహేష్, ఎన్.టి.ఆర్, మెగాస్టార్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు ఉన్నారు మీరు మాత్రమే సూపర్ స్టార్ అనడం.. మేమే గొప్ప నటులం అని చెప్పడం ఏంటని రెండో కామెంట్ లో మళ్లీ బాలకృష్ణ మీద వేసుకున్నాడు నాగబాబు.

మూడో కామెంట్ మళ్లీ రేపు ఉదయం 9 గంటలకు వస్తుందని వీడియో చివరన పెట్టాడు. ఒకసారే చెబితే అన్నిట్లో ఏది దృష్టి పెడతారో అర్ధం కాదు కాబట్టి ఇలా కామెంట్ 1,2,3 ఇలా ప్లాన్ చేశాడు నాగబాబు. ఓ విధంగా నాగబాబు చేస్తున్న ఈ కామెంట్స్ కు మెగాస్టార్ చిరంజీవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబందం లేదు అని చెబితే కచ్చితంగా అది జోకే అవుతుంది. మరి బాలకృష్ణ మాటలకు ఎదురు నిలుస్తున్న నాగబాబు పంతం ఎంతవరకు నెగ్గుతుంది అన్నది వేచి చూడాలి. అంతేకాదు రానున్న కామెంట్స్ లో ఎలాంటి విషయాలు చెబుతాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.. అవి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ నాగబాబు..

Read more RELATED
Recommended to you

Latest news