యాడ్స్.. సింపుల్‌గా.. ఒక్క ముక్కలో చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. అది కంపెనీ ప్రమోషన్ కానీ.. ప్రాడక్ట్ మార్కెటింగ్ కానీ.. ఇంకేదైనా కానీ.. ఆ యాడ్ మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవాలి. కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్టుగా యాడ్ ఉండాలి. సాగదీత ఉండకూడదు. అలా ఉంటేనే కస్టమర్లు కూడా యాడ్స్‌ను ఇష్టపడతారు. వాటిని చూస్తారు. ఆ కంపెనీకి సంబంధించిన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే.. హిందూస్థాన్ యూనిలివర్ కంపెనీ.. తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నీటి ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు అద్భుతమైన వీడియోను రూపొందించింది. సిటీలో ఒక వ్యక్తి షవర్ ద్వారా స్నానం చేసే నీటితో గ్రామంలోని సగం మంది తమ దాహాన్ని తీర్చుకోగలరు.. అన్న కాన్సెప్ట్‌తో రూపొందించారు ఈ వీడియోను. తినే ముందు రుచి గురించి ఎందుకు.. మీరే ఆ వీడియో చూసేయండి.